మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి
- – మేలు చేసాం.. ఓట్లు అడుగు తున్నాం
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్పచారం నమ్మవద్దు
- ప్రచార కార్యక్రమంలో బాలినేని
రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే వస్తుందని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఒంగోలు పట్టణంలో 46, 47 డివిజన్లలో
సోమవారం మన ఒంగోలు- మన వాసన్న కార్యక్రమంలో బాగంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేసారన్నారు. అందువల్లే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఆదరాభిమానాలు చూపుతున్నారని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన రైతులకు, ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, మీకు సంబంధించిన భూమి వివరాలు, అన్ని పత్రాలు, భూమి మ్యాప్లతో సహా మీ వద్దనే ఒక పుస్తకంలో ఉండేలా రూపొందించటం జరిగిందని అన్నారు. దీనిపై చంద్రబాబు అండ్ కో దుష్పచారం చేయటం రైతులను మోసం చేయటమే అని అన్నారు. చెప్పుకోవటానికి ఎమి లేక ఇటువంటి దుష్పచారానికి దిగారని, రైతులు పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. 2014 ఎన్నికల్లో, ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలను ఇచ్చి అధికారంలోనికి రాగానే ఒక్క హామీ కూడ నేరవేర్చలేదని గుర్తు చేసారు. అటువంటి హామీలతోనే మరలా 2024లో వస్తున్నారని ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రజలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నవరత్నాలు అమలు చేసి 95 శాతం. నెరవేర్చి ప్రజలందరికీ మేలు చేసామని ఈ ఎన్నికల్లో అందుకే నిర్భయంగా ఓట్లుఅడుగుతున్నామని అన్నారు. ఒంగోలు నియోజక వర్గంలో గత ఐదు సంవత్సరంలో 4485 కోట్లతో నియోజక వర్గ అభివృద్ధి పనులు చేసామని చెప్పారు. ప్రజలకు ప్రతి ఇంటికి ప్రతి రోజు నీరు అందించేందుకు చర్యలు చేపట్టామని అక్కా చెల్లెమ్మలకు స్వంత ఇంటి కల సాకారం చేసేందుకు రూ.231 కోట్లు వెచ్చించి 20వేల పట్టాలు అందించామని, రాబోవు 9 నెలలో ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. ప్రతి కులానికి ఆరామ క్షేత్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసామని చెప్పారు. వైద్యశాల అభివృద్ధి, పేదలకు ఆధునాతన వైద్యం అందుబాటులోనికి తెచ్చామని అన్నారు. రూ.298 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టామని, ఒంగోలు పట్టణంలో 20 పార్కులు అభివృద్ధి చేసామని, ఒంగోలు పట్టణంలో రోడ్లు, కాలువలు అభివృద్ధి చేసామని, అండర్ డ్రైనేజి ఏర్పాటు చేయటానికి కృషి చేస్తామని చెప్పారు. నియోజక వర్గంలో మేజర్ రోడ్ల అభివృద్ధి చేసామని, ఒంగోలు, కొత్త పట్నం మండలాలలో అంతర్గత రోడ్లు అభివృద్ధి చేసామని, కమ్యునిటీ భవనాలు, ప్రభుత్వ భవనాలు నిర్మించామని, నాడు- నేడుతో పాఠశాల ఆధునీకరణ, చేయించామని, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. అన్ని రకాలుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండతో నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసామని వివరించారు. మరింత సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగటానికి ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాఢ సుజాత, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కఠారి శంకర్, అగ్రోస్ కార్పోరేషన్ డైరెక్టర్ పురిని ప్రభావతి, ఎఎంసీ చైర్మన్ కఠారి రామచంద్రరావు (చంద్రం), డివిజన్ అధ్యక్షుడు చావల శ్రీనివాసులు, ఇన్చార్జి చిట్టెంరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఇప్పాల శివా రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కన్వినర్లు సి సుబ్రమణ్యం, పసుపులేటి ఏడుకొండలు, కాంతమ్మ, ముఖ్య నాయకులు పుల్లగుజ్జు వే ణుమాదవ్(బుజ్జి), అల్లూరయ్య, ఈ నరసింహారావు, సాదా నరసింహారావు,కొప్పొలు వెంకటేశ్వర్లు, దీలీపుమార్, కావేరి ఆనందరావు, మనోజ్ కుమార్, సీహెచ్ బాల మాలకొండయ్య, గోపి, సునీల్, హరి క్రిష్ణా రెడ్డి 46 వ డివిజన్ అధ్యక్షుడు కూతర్ల విజయభాస్కర్, ఇన్చార్జీలు గాదే కోటి రెడ్డి, విశ్వబ్రహ్మాణ సంక్షేమసంఘం డైరెక్టర్ గోనుగుంట రజని, నాగూర్ మహేష్ బాబు, రమేష్ రెడ్డి, సచివాలయ కన్వినర్ కె వెంకటప్రసాద్, సుదర్శన రావు, వేముల విజయ్, సుమన్, గోపి రెడ్డి నారాయణ రెడ్డి, చింటి, మార్క్, చెన్నయ్య, రసూల్, షేక్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఆయా డివిజన్లలో నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస రెడ్డికి పూల మాలలతో ఘన స్వాగతం పలికారు.