గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను ను వెలికితీసేందుకే ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిం చారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 300 మీటర్ల జాతీయ పతాకంతో రెవెన్యూ కార్యాయం నుంచి పోదిలి రోడ్డు మీదుగా జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలు ప్రారంభిం చారు. క్రికెట్, వాలీబాల్ క్రీడలు ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. నగర పంచాయతీ కమిషనర్ మహేశ్వరరావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు,ఎంపీడీఓ ఎన్వీఎల్ హనుమంతరావు, డీటీ రవి శంకర్, ఎంపీపీ సుధాఅచ్చయ్య, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికే షన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ యవజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ లు ఎదురు కోటిరెడ్డి, బత్తినేని వెంకటేశ్వర్లు, మేడికొండ జయంతి, కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి, వీసీ రెడ్డి, జగన్నాథం మోహన్ బాబు, బాబూరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, పట్టణ అధ్యక్షుడు కట్టెకోట హరీష్, వైస్ ఎంపీపీలు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు గంజి వెంకటేశ్వరరెడ్డి, ఖాశీం బ్రదర్స్ పాల్గొన్నారు.



