ఆడుదాం ఆంధ్ర తో గ్రామీణ ప్రాంత యువతలో ఉత్సాహం – ఎంపీపీ తాటికొండ – తాళ్లూరులో ఉత్సాహంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం.. ఆంధ్రా ఆటల పోటీలు గ్రామీణ ప్రాంత యువతలో ఉత్సాహాన్ని నిం పుతోందని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రం తాళ్లూరు హైస్కూల్లో మంగళవారం ఆడుదాం..ఆంధ్రా ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఎంపీడీఓ యుగకీర్తి, ఎస్ఐ వైవీ రమణయ్య, కో ఆప్షన్ సభ్యుడు కరిముల్లా, సొసైటీ అధ్యక్షుడు యాడిక యలమందారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి జి సుబ్బయ్య, ఎంఈఓ 2 సుధాకర్ రావు, ఎం ఎల్ ఓ నాగమల్లేశ్వరరావు రెడ్డి, గ్రామ కార్యదర్శి లక్ష్మీకాంత్ , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా ఆటల ప్రాముఖ్యత తెలుపుతూ గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *