ప్రజావాణి కి పోటెత్తిన ప్రజలు.శుక్రవారం ప్రజావాణి లో 702 దరఖాస్తులు………దరఖాస్తు దారులకు న్యాయం జరిగేలా చూస్తాం…రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి.

మహాత్మా జ్యోతి బా పూలే ప్రజాభవన్ కు దరఖాస్తు దారులు పోటెత్తారు.ప్రజావాణి లో అందిన దరఖాస్తులకు న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి అన్నారు.శుక్రవారం
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలతో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్ అధికారులను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోదయ్యాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 175, పంచాయతి రాజ్, గ్రామిణాభివృద్ధి శాఖకు సంబందించి 60 దరఖాస్తులు, పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 54, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 51, హోం శాఖకు సంబందించి 38 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 374 అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు శ్రీమతి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించండం తో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *