దర్శిలోని ఎన్ఏపి చెరువు వద్ద సరదాగా ఈతకు వెళ్లి పదో తరగతి చదివిన విద్యార్థులు ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం ఈ ఏడాది దర్శిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన ఇద్దరు విద్యార్థులు దర్శి మండలం ఎర్ర ఓబునపల్లె పంచాయతీలోని లూదగిరి కాలనీకి చెందిన బొందల నవీన్(16), కొనకనమిట్ల మండలం వద్దిమడుగు గ్రామానికి చెందిన వసంతపురం చందు(16) ఇద్దరు సరదాగా ఈతకు వెళ్లి నీటిలో మునిగి మతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. గురువారం ఇద్దరూ కలిసి ఎన్ఎపి చెరువులో ఈతకు వెళ్లి శుక్రవారం శవాలై తేలారు. అయితే కనిపించకుండా పోవడంతో వీళ్ల తల్లిదండ్రులు బాలశౌరి, చెన్నయ్య, కుటుంబ సభ్యులు వెతికినా కనిపించలేదు. చివరకు శుక్రవారం ఉదయం చెరువులో శవాలుగా బయటపడ్డారు. వీళ్లు ఇద్దరూ ఈతకు వెళ్లి ఉండి ఉండవచ్చని ఏఎస్ఐ రాంబాబు తెలిపారు. ఈ మృతదేహాలకు దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలోపోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏఎస్ఐ తెలిపారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. బొందల బాలశివునికి నలుగురు కుమారులు కాగా నవీన్ ఆఖరివాడు. అదేవిధంగా వసంతపురం చెన్నయ్యకు ఇద్దరు కుమారులు చందు చిన్నవాడు. వీరి మరణంతో ఆ గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

