స్కూల్ బస్ లు ఫిట్ నెస్ లేకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎంవీఐ రవికుమార్ హెచ్చరించారు. డీటీసీ ఆర్. సుశీల ఆదేశాల మేరకు దర్శి ఎంవీఐ కార్యాలయం పరిధిలో స్కూల్ బస్ ల పై 10 రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంలో భాగంగా శుక్రవారం నాలుగు బస్ ల కు రూ.90 వేల జరి మానా విధించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ….స్కూల్ బస్ డ్రైవర్ కు లైసెన్స్, ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ట్యాక్స్ లు తప్పని సరిగా కట్టాలని సూచించారు. ఫిట్నెస్ లేని వాహనాల్లో స్కూల్ విద్యార్థులను ఎక్కించినా, లైసెన్స్ లేని డ్రైవర్లు స్కూల్ బస్లు తోలినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వాహనాలు తోలే వారు సీట్ బెల్ట్లు తప్పని సరిగా పెట్టుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహ
వాహనాలు నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. నిబంధనలు పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
