మూగ యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దురదృష్టకరం… బిజెపి మహిళా మొర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు..

చీమకుర్తి మండలంలో మూగ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన దురదృష్టకరమని ఇటువంటి సంఘటనలు పట్ల ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు తీవ్రంగా ఖండించారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూగయువతిపై మాయమాటలు చెప్పి ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం సభ్య సమాజానికి సిగ్గుచేటని మండిపడ్డారు. అభం శుభం తెలియని మూగ యువతిపై ప్రేమ పేరుతో నమ్మబలికి యువకుడు తన స్నేహితులతో కలసి అత్యాచారం చేయడం ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం దురదృష్టకరం అని అన్నారు. ఇటువంటి సంఘటనలు జరగడం పట్ల ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి అనైతిక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అమే కోరారు. అదేవిధంగా మహిళలు, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సమాజంలో జరుగుతున్న పరిస్థితుల పట్ల అవగాహన కలిగి ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై దృష్టి ఉంచాలని ఆమె కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *