ట్రాఫిక్ నియమాలను పాటించండి మీ భవిష్యత్తును కాపాడుకోండి:- బేగంపేట టి టీ ఐ ఎ సి పి జి. శంకర్ రాజు…….

ట్రాఫిక్ నియమాలను పాటించండి.మీ భవిష్యత్తును కాపాడుకోండి అని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏ సి పి జి.శంకర్ రాజు అన్నారు.శనివారం బేగంపేట టి టీ ఐ ఆధ్వర్యంలో పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో వైద్య విద్యార్థులు మరియు సిబ్బంధికి రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏ సీ పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదన్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 5000 వరకు జరిమానా మరియు మూడు నెలల జైలు శిక్షను కూడా విధిస్తారనీ, ముఖ్యంగా రెడ్ సిగ్నల్ పడినప్పుడు తప్పనిసరిగా వాహనం ఆపాలన్నారు. హైదరాబాద్ పోలీసు కమేశనరేట్ పరిధిలో 2023 లో 65,413 & 2022లో 42,261 సిగ్నల్ జంపింగ్ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి, వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి అని చెప్పారు. కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో సీట్ బెల్ట్ ధరించాలి. వాహనాలు నిర్లక్ష్యముగ నడపటం ఎప్పుడు ప్రమాదకరం అన్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం దీర్ఘాయువును పొడిగిస్తుంది మరియు శరీరం మనస్సును పునరుత్పత్తి చేస్తుందన్నారు.ఈ సందర్భంగా వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమములో సుమారు 300 మంది వైద్య విద్యార్థులు & సిబ్బంది మరియు డాక్టర్ భీరప్ప-డైరెక్టర్ నిమ్స్, డాక్టర్ ఓం సాయి సతీష్ -అసోసియేట్ ప్రొఫెసర్, శ్రీనివాసులు శ్రీరామదాస్- ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్, శ్రీమతి ద్రాక్షాయణి-ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, డాక్టర్ శ్రవణ్- ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *