విద్యార్థులు పట్టుదలతో వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని హీరోయిన్ తాప్సి పన్ను పిలుపు నిచ్చారు.బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో శని వారం స్నాట కొస్తవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హీరోయిన్ తాప్సి పన్ను హాజరయ్యారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు వారికి నచ్చిన రంగాల్లో కూడా తమ ప్రతిభకు మరింత పడునుపెట్టుకోవాలన్నారు.ఆట,పాటల్లో సైతం తమ ప్రతిభను మెరుగుపర్చుకోవాలన్నారు.ముందుగా ముఖ్య అతిథి తాప్సి పన్ను ను ప్రిన్సిపాల్ డా. స్కంద బాలి విద్యార్థులకు పరిచయం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు చప్పట్లు కొడుతో కేరింతలతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన విజయాలు,సమాజానికి చేసిన సేవలను ప్రశంసించారు.అసాధారణమైన ప్రతిభ నైపుణ్యాన్ని కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను ప్రధానం చేశారు.విద్యార్థులు సంగీతం తో అందరినీ మంత్ర ముగ్ధులను చేశారు.విద్యార్థులకు మోమెంటోలు,పుస్తక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తాప్సి కి యాజమాన్యం ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ అమ్రిత చంద్ర,రిజిస్టర్ కల్నల్ పీ ఎల్ ఎన్ శర్మ,విద్యార్థులు వారి తల్లి దండ్రులు పాల్గొన్నారు.




