ఆషాఢ బోనాల -ఆషాడ మాస బోనాల సమావేశానికి రావాలంటూ తలసానిని ఆహ్వానించినదేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు…………………..

ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఈ నెల 26 వ తేదీన జరిగే సమావేశానికి హాజరు కావాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి సోమవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఈ మేరకు ఆహ్వానాన్ని అందజేశారు. ఈ నెల 26 వ తేదీన ఉదయం 10.00 గంటలకు మహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం ఏర్పాటు చేసినట్లు ఈ ఓ వివరించారు. ముందుగా ఆలయ పండితులు ఎమ్మెల్యే కు ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బీ ఆర్ ఎస్ పార్టీ రాంగోపాల్ పేట డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Prev ఎకరం 4 లక్షల రూపాయలు -తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ ఇదేఎజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ!హైవేల పక్కన ఉంటే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెంపువెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నభూమి విలువ రూ.కోటి వరకు సవరణ -నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి రూ.1,000.. అపార్ట్‌మెంట్ల కంపోజిట్‌ విలువ చదరపు అడుగుకు రూ.1,500మార్కెట్, ప్రభుత్వ విలువల మధ్య బాగా వ్యత్యాసం ఉన్న చోట భారీగా విలువల పెంపు -నేటి సాయంత్రానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలు29వ తేదీ నాటికి తుది విలువలు నిర్ధారణ -ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమలు!
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *