ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని ఇప్పుడు పోలీసు అధికారి (ఏసిపి )అయ్యానని బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి అన్నారు .మంగళవారం బేగంపేట్ బండి మెట్ పాటిగడ్డ పాఠశాలలో రిటైర్డ్ హెచ్ఎం రఘు సతీష్ కుమార్ తో కలిసి ఏసిపి విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని వారి పర్యవేక్షణలో చిన్నారులు తప్పకుండా అభివృద్ధి చెందుతారని అన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులు వేసినట్లయితే వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని ఆయన పేర్కొన్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మంచి బహుమతులు అందజేస్తానని ఏసిపి ఈ సందర్భంగా తెలియజేశారు .రిటైర్థ్ హెచ్ఎం రఘు సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు భావిభారత పౌరులు కావాలంటే ఉపాధ్యాయుల పాత్రే చాలా కీలకమైంది అన్నారు .2020 తాను రిటైర్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇద్దరు విద్యార్థులను దత్తత తీసుకొని వారి చదువు ఫీజులు బట్టల బాధ్యతను తానే చూసుకుంటున్నా అన్నారు అంతేకాకుండా బాసర త్రిబుల్ ఐటీ లో గత సంవత్సరం సిరివెళ్ల దేవకి మాసబ్ ట్యాంకులో సిఎస్సి చదువుతున్న దీపక్ ల కు కూడా నోట్ పుస్తకాలు అందజేస్తున్నానని ఆయన అన్నారు ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



