18వ లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు.. స్పీకర్ కుర్చీలో ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూర్చొబెట్టారు..
లోక్ సభ స్పీకర్ గా భాజపా ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. అంతకు ముందు స్పీకర్ గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. మరోవైపు, ఇండియా కూటమి తరఫున కె. సురేష్ పేరును ప్రతిపాదించారు.
అనంతరం ప్రొటెం స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు.
మూజువాణీ ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక ప్రక్రియలో ఓం బిర్లా విజేతగా నిలిచారు..
