ఎన్నో ఏళ్లుగా వినియోగదారుల మన్ననలు పొందు తున్న ఆల్ఫాహోటల్ పై కొంతమంది అసత్య ప్రచారం చేయడం మంచి విధానం కాదని అల్పాహోటల్ యజమాన్యం ఆక్షేపించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతంలోని ఆల్ఫాహోటల్ పైన పలు పత్రికలలో వచ్చిన నిరాధారణమైన ఆరోపణలను హోటల్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ఫాహోటల్ యాజమాన్యం తప్పుగా వచ్చిన పలు కథనాలపై స్పందించింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.జంట నగరాలలో ఎంతో పేరున్న తమ హోటల్ పై ఆన్లైన్లో తప్పుడు కథనాలు చూసి ఇష్టం వచ్చినట్లుగా కొన్ని పత్రికలు కథనాలు రాశాయని తెలిపింది. కొన్ని పత్రికలు అయితే ఇతర హోటల్స్
లో ఉండే అపరిశుభ్రమైన కిచెన్ ఫోటోలు జోడించి అవి తమ కిచెన్ లోవి అన్నట్లుగా తప్పుగా చూపించారని తెలిపారు. సుమారు 80 సంవత్సరాల కు పైగా రోజుకు వేలాదిమంది కస్టమర్లకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న తమ హోటల్, ఏనాడు అశుభ్రమైన నాణ్యతలేని ఆహారాన్ని అందించలేదన్నారు.తమ పై నేటి వరకు ఏ ఒక్క కంప్లైంట్ కూడా లేదన్నారు. ఈ మధ్య కాలంలో తమ హోటల్ ను సందర్శించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్లోని అంతర్గత రూములను, కిచెన్ను, బయట ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి తయారీ క్రమంలో ఉన్న బేకరీ ఆహార వస్తువులపై ఎప్పటికప్పుడు మూతలు వుండేలా చూసుకోవాలి అని, బేకరీ ఫుడ్స్ ఫై లేబుల్స్, డేట్ ను తప్పకుండా ముద్రించాలని మాత్రమే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సూచించారని వివరించారు. అధికారులు సూచించిన సమాచారాన్ని ట్విట్టర్లో పోస్టు కూడా చేశారని , దాన్ని ఆసరాగా చేసుకునీ కొన్ని పత్రికలు వారిష్టం వచ్చినట్లుగా , కథనాలు రాశారన్నారు. నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్నట్లుగా కుళ్లిపోయిన మాంసాహారాలను నిలువ ఉన్నట్లుగా కథనాలు రాయడం మంచి విధానం కాదన్నారు. ఆయా కథనాలు రాసిన పత్రికల యాజమానులు పున: పరిశీలించాలని వారు కోరారు. జంట నగరాలలో మంచి పేరు, చరిత్ర వున్న తమ హోటల్ పైన తప్పుడు కథనాలు, ఆరోపణలు, నిందలు వేయొద్దని,తాము వినియోగదారుల నమ్మకాన్ని ఎప్పటికీ కలిగి వుంటామని వారు తెలిపారు.
