మైనర్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరం:-….,…. బేగంపేట్ టి.టి.ఐ ఎసిపి జి శంకర్రాజు……..

మైనర్ల డ్రైవింగ్ ఎంతో ప్రమాదకరమైందని తల్లిదండ్రులు చిన్నారులకు వాహనాలు ఇవ్వవద్దని బేగంపేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏసిపి జి. శంకర్ రాజ్ అన్నారు.
టి టి ఐ సిబ్బంధి అద్వర్యంలో బుధవారం సాకేత జూనియర్ కలశాలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా టిటిఐ ఏసిపి శంకర్రాజు మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు పిల్లలు ( మైనర్లు ) వాహనాలు నడపరాదని ఆది చట్టరీత్య నేరమని తెలిపారు.అలా వాహనాలు నడిపితే వాహన యజమానికి రూ 25,000,లు 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందన్నారు. దీనితో పాటు, వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ఒక సంవత్సరం పాటు రద్దు చేయబడుతుందని, వారి పై చదువులకు పాస్పోర్ట్ మరియు వీసా రాదన్నారు. ఈ సంవత్సరం 690 మంది మైనర్లకు వారి తల్లితండ్రుల సమక్షంలో టీటీఐ బేగంపేటలో కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. యువత సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పోవడం వల్ల ఆక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. దానివల్ల వారి అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకోని, వారి కుటుంబాలలో విషాద ఛాయలు నింపుతున్నారు
అని చెప్పారు. వాహనాలు అతి వేగంతో నడపటం ఎప్పుడు ప్రమాదకరం అన్నారు. రహదారులపై క్రమశిక్షణగా వ్యవహారించాలన్నారు. మీ రక్షణ కు, ఇతరుల రక్షణ కోసం వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు. చాల మంది యువత మత్తు పదార్థాలకు, మద్యానికి అలవాటపడి వారి అమూల్యమైన భవిష్యతును కోల్పోతున్నారు అని చెప్పారు. కలశాలలో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ చేయరాదని అవి చట్ట రీత్యా నేరమని తెలియజేశారు. ఈ కార్యక్రమములో 150 మందీ విద్యార్ధులు మరియు సిబ్బంధి పాల్గొన్నారు. ఏ సి పి జి శంకర్ రాజు , ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మలక్పేట ట్రాఫిక్ పీఎస్, ఎస్ఐ మలక్ పేటలోని సాకేత జూనియర్ కళాశాల ఆడిటోరియం హాలులో సిహెచ్ రామస్వామి సిబ్బందితో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జె.శ్రీధర్ రెడ్డి (చైర్మన్ ), పి.రాంచంద్రారెడ్డి (ప్రిన్సిపాల్ ) , ఉత్తమ సేవా ఫాతకం ఫోందిన మలక్ పేట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐ – మహ్మద్ జానీ, ఏఎస్ఐ . సుధాకర్ రెడ్డి, . జె.శివ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *