శ్రీగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఆర్జిత సేవల ధర్మకర్త జ్వాలా రామారావు మృతి – సంతాపం తెలిపిన శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి.

శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధిలో అహర్నిశలు కృషిచేసి మరో తిరుమలగా రూపుదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆలయ దేవస్థాన ధర్మకర్తల మండలి ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాలారావు హైదరాబాదులోని తమ గృహంలో స్వర్గస్తులైనారని, వారి పవిత్రాత్మకు సద్గతులు లభించాలని, తమ పాదాల చెంతకు చేర్చుకోవాలని శ్రీ వేంకటేశ్వరుని ప్రార్ధిస్తున్నామని శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యం తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శుక్రవారం స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన జ్వాలా రామారావు గారి సంస్మరణ సభలో వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్నివ్వాలని సంతాప తీర్మానంలో పేర్కొన్నారు.

కార్యక్రమంలో శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, కార్యదర్శి త్రిపురం మల్లికార్జునరావు, సహకార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, సభ్యులు నూనె రామాంజనేయులు, ధనిశెట్టి రామునాయుడు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు మరియు విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లెళ్లమూడి వేంకటేశ్వర్లు, కార్యదర్శి ఇనమనమెళ్లూరి సీతారామయ్య, సహకార్యదర్శి ఈమని బలరాం, గడ్డం శ్రీనివాసులు, కోశాధికారి సాధు శ్రీనివాస గుప్తా, నగర అధ్యక్షులు పసుమర్తి వేంకటేశ్వర్లు, నగర సత్సంగ ప్రముఖ్ సుంకు రఘు, చక్రధర పెరుమాళ్లు, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *