ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.ప్రమాదాల నుంచి కాపాడుకోండి……బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు………..

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రమాదాల నుంచి కాపాడుకోవాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏసిపి జి శంకర్ రాజు అన్నారు.
గురువారం ఆదర్శనగర్ డిజి లోన్ స్టార్ పవర్ డిజిటల్ డిజిటల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ లో రోడ్డు భద్రత ట్రాఫిక్ పై సిబ్బందికి అవగాహన కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు . ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రాంగ్ రూట్ లో వెళ్లడం ,సెల్ఫోన్ డ్రైవింగ్ ,స్టాప్ లైన్, ట్రిపుల్ రైడింగ్ ప్రమాదకరం అన్నారు. పాదచారులు జిబ్రా క్రాసింగ్ వద్ద వెళ్లేటప్పుడు వాహనదారులు తప్పని సరిగా వాహనాలు ఆపాలన్నారు. ముఖ్యంగా యువత మితిమీరిన వేగంతో వాహనాలపై ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని
వారి కుటుంబాలకు తీరని కన్నీటి వ్యధను మిగులుస్తున్నారని ఆయన అన్నారు. వేగం కంటే ప్రాణం ముఖ్యమని యువత గుర్తించాలన్నారు. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ సర్టిఫికెట్ అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో డిజి లోన్ స్టార్ పవర్ డిజిటల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ బి శివరామకృష్ణ ఆఫీస్ డైరెక్టర్ జి రాజేష్ ఆఫీస్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *