2024 , 2025 మధ్య కాలంలో భారతీయ రైల్వేలు 10000
నాన్-ఎసి కోచ్‌ల ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం చేసింది…
భారతీయ రైల్వేలు సాధారణ ప్రయాణీకుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి రాబోయే రెండేళ్ల కాలంలో సుమారు 10,000 నాన్-ఎసి కోచ్‌ల ఉత్పత్తికి ప్రణాళిక సిద్దంచేసింది. అధికారులు అందించిన సమాచారం ప్రకారం 2024- 25 , 2025-26 ఆర్థిక సంవత్సరాల లో, రికార్డు స్థాయిలో 5300 జనరల్ కోచ్‌లతో కలుపుకొని మొత్తంగా సుమారు 10000 కోచ్‌లు తయారు చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో, అమృత్ భారత్ జనరల్ కోచ్‌లతో సహా 2605 జనరల్ కోచ్‌లు, అమృత్ భారత్ స్లీపర్ కోచ్‌లతో సహా 1470 నాన్ ఎసి స్లీపర్, అమృత్ భారత్ ఎస్ఎల్ఆర్ కోచ్‌లు కలుపుకొని మొత్తంగా 323 ఎస్.ఎల్.ఆర్ కోచ్‌లు, 32 హై కెపాసిటీ పార్శిల్ వ్యాన్ మరియు 55 పాంట్రీ కార్లను తయారు చేయాలని యోచిస్తోంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో, అమృత్ భారత్ జనరల్ కోచ్‌లతో సహా మొత్తం 2710 జనరల్ కోచ్‌లను, 1910 నాన్ ఎసి స్లీపర్‌తో సహా అమృత్ భారత్ స్లీపర్ కోచ్‌లను, 514 ఎస్ఎల్ఆర్ కోచ్‌లతో సహా అమృత్ భారత్ ఎస్ఎల్ఆర్ కోచ్‌లను, 200 హై కెపాసిటీ పార్శిల్ వ్యాన్ లు మరియు 110 పాంట్రీ కార్లను తయారు చేయాలని రైల్వే యోచిస్తోంది.
కాలానుగుణ మార్పులకు అనుగుణంగా రైలు సేవలు డిమాండ్ కు అనుగుణంగా మరియు ప్రయాణీకుల రద్దీ పెరగడం వలన ఇది పెరగడం తగ్గడం జరుగుతుంది. కోచ్‌ల అవసరం ఈ కారకాలపై ఆధారపడి ఉంటుంది అందువల్ల కోచ్ ల తయారీ ప్రణాళికను వార్షిక కోచ్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్‌లో చేరుస్తుంది. కోచ్‌ల ఉత్పత్తి సాధారణంగా అవసరానికి అనుగుణంగా ఉంటుంది.

