తాళ్లూరు మండలంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకంలో పనులు వేగవంతం చెయ్యాలని ఎంపీడీఓ సుందర రామయ్య అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో రైతులకు అవసమైన పనుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఫార్మ్ పాండ్స్, గ్రామాలలో నివాసాల వద్ద ఇంకుడు కుంటలు వంటి పనుల కేటాయించి వేగవంతం చెయ్యాలని కోరారు. ఎపీఓ మురళి, ఈసీ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.
