తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి
మంగళవారం తాళ్లూరులో ఎస్సీ కాలనీకి చెందిన పులుగు చిన మోష కి రూ. 5వేలు ఆర్ధిక సహాయం అందించారు. దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లిలిత్ సాగర్ల ఆదేశాల మేరకు చినమోష ను పరామర్శించి ఆర్థిక సహాయం అందించినట్లు శ్రీనివాస రెడ్డి తెలిపారు. త్వరగా కోలుకుని యధా జీవన స్థితికి రావాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆకాంక్షించినట్లు చెప్పారు. ఆయన వెంట ఎస్సీ కాలనీ టిడిపి నాయకుడు నాదేండ్ల శ్రీనివాస రావు ఉన్నారు.
