జనవరి 15 వరకు ఫసల్ భీమా యోజన పథకంలో రైతులు రబీలో సాగు చేసిన పంటలకు భీమా నగదు చెల్లించవచ్చని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. మండలంలోని దోసకాయలపాడు, లక్కవరం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. పంటల నమోదుకు రీ సర్వే గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయని ఆన్లైన్లోలో ఇతరుల లోని భూములు డికే పట్టా భూములు అన్నింటికి విఆ, విఏ ఏ గ్రామ సర్వేయర్ కలిసి పంటలు ఈ – క్రాప్ నమోదుకు సమన్వయంతో పనిచెయ్యాలని తహసీల్దార్ సంజీవ రావు కోరారు. దోసకాయలపాడు సర్పంచి కోట శివ లక్ష్మి వెంకట రామి రెడ్డి, గ్రామ సర్వేయర్ సాయి కిరణ్, విఏఏ లు భార్గవి, కె వీరాంజనేయులు పాల్గొన్నారు.
