ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు వైద్య సేవల మరింత
మెరుగ్గా అందించేందుకు తగిన సూచనలు చెయ్యాలని చీమకుర్తి సీహెచ్సీ వైద్యాధికారి గైనకాలజిస్ట్ శ్వేత అన్నారు. తూర్పుగంగవరం పీహెచ్ సి లో వైద్యాధికారి మౌనిక అధ్యక్షతన ఆరోగ్య, ఆశ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గైనకాలజిస్ట్ శ్వేత మాట్లాడుతూ గర్బిణీ స్త్రీలకు చీమకుర్తిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. డెలివరీలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని వైద్యశాలకు పంపాలని కోరారు. డీఎ ఎం ఓ సుబ్బా రెడ్డి లెప్రసీ రోగులకు అందిస్తున్న సేవలను వివరించారు. వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ఐ ఓ చంద్రశేఖర్ పీ హెచ్ ఎన్ మంజుల తదితరులు పాల్గొని వైద్య సిబ్బందికి గ్రామీణ వైద్య సేవలు అందించాల్సిన విధానాన్ని వివరించారు.
