విజ్ఞానం పెంచుకొని ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులు మరిన్ని లాభాలు పొందవొచ్చు – జిల్లా కలెక్టర్ .ఏ.తమీమ్ అన్సారియా

         విజ్ఞానం పెంచుకొని ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులు మరిన్ని లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ .ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సికింద్రాబాద్ లోని  బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న ' ఉద్యాన ఉత్సవం - 2025 ' విజ్ఞాన యాత్రలోపాల్గొనేందుకు జిల్లా నుంచి వెళ్తున్న రైతులతో కూడిన బస్సుకు మంగళవారం రాత్రి ప్రకాశం భవనం వద్ద ఆమె జండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రకు జిల్లా నుంచి మొత్తం 70 మంది రైతులు వెళుతున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. వీరు రెండు బస్సుల్లో తరలి వెళ్తున్నారని, ఒక బస్సు మార్కాపురంలోబయలుదేరి ఎర్రగొండపాలెం మీదగా వెళ్తుందని,  మరో బస్సు ఒంగోలులో బయలుదేరి అద్దంకి మీదగా వెళ్తుందని ఆయన చెప్పారు. అద్దంకి మీదగా వెళ్తున్న బస్సుకు ఈ సందర్భంగా కలెక్టర్ జెండా ఊపి రైతులకు వీడ్కోలు పలికారు. 
       ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రమేష్ , రామమోహన్ రావు, ఆత్మ డి.పి.డి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *