రెవిన్యూ అధికారులు ప్రజలకు సహకరించాలి – ఎం. పి. పి తాటికొండ – రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు

రెవెన్యూ అధికారులు ప్రజలకు సహకరించి రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు కోరారు.
తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయం లో రెవెన్యూ అధికారులు,సిబ్బంది తో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ.. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషి మేరకు డిప్యూటీ తహసిల్దార్ ని ఇంచార్జ్ తహసీల్దార్ గా నియమించారు. గత కొంతకాలంగా తహసీల్దార్ కార్యాలయంలోలో పనులు జరుగక ఇబ్బందులు పడున్నారని తెలిపారు. ప్రజలకు, రైతులకు రెవెన్యూ సంబంధించిన సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలని కోరారు. రైతుసమస్యలు పై జాప్యం చెస్తే సిబ్బంది పనితీరు పై దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత సాగర్ ల దృష్టికి తీసుక వెళ్ళటం జరుగు తుందాందాన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు , కార్యాలయ సిబ్బంది ,వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *