క్విస్ కాలేజ్ అఫ్ ఫార్మసీ లో మాదకద్రవ్యాల దుర్వినియోగం పై మరియు మహిళసంరక్షణ పై మరియు సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమాన్ని ఫార్మసీ విద్యార్ధిని విద్యార్దులకు
ఘనముగా నిర్వహించారు .
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహిళా పోలీసు స్టేషన్ ఒంగోలు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర లీల మాట్లాడుతూ ….డ్రగ్స్ కు అలవాటు అవుతున్న వారిలో చాలామంది విద్యార్థులే ఉంటున్నారని ఇది వారి భవిష్యత్తును చాలా దెబ్బతీస్తుంది అన్నారు. అంతేకాకుండా మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారు తమకు పట్టుపడితే శిక్ష కఠినంగా ఉంటుందని కాబట్టి విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తతో ఉండాలని విద్యార్థులకు సూచించారు.
ఉమెన్ సబ్ ఇన్ స్పెక్టర్ గౌతమి మాట్లాడుతూ ….మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వొచ్చని అలాంటి వారిపై ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో మాదక దవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. అలానే మహిళల రక్షణ పై ,మరియు వారి చట్టాల పై కూడా అవగాహన కల్పించారు కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ డాక్టర్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి గారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ శ్రీ గాయత్రి , కళాశాలల ప్రిన్సిపాల్ డా.కిషోర్ బాబు , యువజన సంక్షేమశాఖ, స్టెప్ అసిస్టంట్ మేనేజర్ రాజా ,పావని మరియు ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ధనమూర్తి,కళాశాల అధ్యాపక అధ్యాపకేతర ,ఏన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.


