ప్రకాశం విభాగ్ విశ్వహిందూ పరిషత్ కార్యాలయము “అయోధ్య భవనం” రెండవ వార్షికోత్సవం కార్యాలయం అయోధ్య భవనంలో గురువారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వి.హెచ్.పి జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రాంత సత్సంగ్ ప్రముఖ సోమ సుబ్బారావు మాట్లాడుతూ నగరంలో హైందవ ధర్మం గురించి మాట్లాడుటకు, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రాంత పెద్దలు సూచన మేరకు కార్యకర్తల కృషి మేరకు హిందూ బంధువుల ఆర్థిక సహకారంతో రెండంతస్తుల భవనం అయోధ్య భవనాన్ని నిర్మించుకోవడం జరిగిందని, ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ భవన నిర్మాణానికి కృషిచేసిన కార్యకర్తలను గుర్తుంచుకోవడం, గౌరవించడం, దాతలకు ధన్యవాదాలు తెలపడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వివిధ హైందవ సంఘాలు సమిష్టిగా ఏర్పాటు చేసే కార్యక్రమాల గురించి చర్చించుకోవడానికి, హిందూ ధర్మ వ్యాప్తికి, పునర్వైభవం తేవడానికి, విశ్వహిందూ పరిషత్ ప్రాంత పెద్దలు విచ్చేసి బస చేయడానికి, ఒంగోలు నగరం మధ్య లో ఏర్పాటు చేయడం ద్వారా రైల్వే స్టేషన్ కు బస్టాండ్ కు కూతవేటు దూరంలో కార్యకర్తలకు దగ్గరగా ఏర్పాటు చేయడం నాటి భవన నిర్మాణ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ జనవరి 5 విజయవాడలో జరిగినటువంటి హైందవ శంఖారావం సభకు ఒంగోలు నుండి 25 బస్సుల ద్వారా కార్యకర్తలు హిందూ బంధువులు తరలి వెళ్లి సభ దిగ్విజయం చేయడం జరిగిందని, కృష్ణ పరమాత్మ బోధించినట్లు ధర్మానికి గ్లాని జరిగినప్పుడు తాను మరల వస్తానని చెప్పారని ఆ కృష్ణ పరమాత్మ ఎవరో కాదు హైందవ శంఖారావానికి వెళ్ళిన హిందూ బంధు జనావళేనని ఉత్తేజ భరితంగా ఉపన్యసించారు.
కార్యక్రమంలో ముందుగా భారత మాత చిత్రపటానికి దేవతామూర్తుల చిత్రపటాలకు పూజా కార్యక్రమం నిర్వహించి ఏకాత్మక స్తోత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ విజయమంత్రాన్ని మరి విశ్వహిందూ పరిషత్ గేయాలను ఆలపించారు కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత సత్సంగ ప్రముఖు సోమ సుబ్బారావు జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జున్ రావు కార్యదర్శి ఐ సీతారామయ్య ఏమని బలరాం ఉపాధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు పసుమర్తి వెంకటేశ్వర్లు సుంకు రఘు నేరెళ్ల శ్రీనివాసరావు గడ్డం శ్రీనివాసులు బెల్లం ప్రసాదు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు సమావేశానికి విచ్చేశారు.

