ఆడపిల్లలు భావితరాలకు పునాదిరాళ్లు

ఆడపిల్లలు భావితరాలకు పూనాదిరాళ్లని …దేశ భవిష్యత్తు బాలికలపైనే ఆధారపడి వుందని ఎంఈవో జి.సుబ్బయ్య తెలిపారు. స్థానిక కెజీబీవీ, వి కె గవర్నమెంట్ స్కూల్ నందు జాతీయ బాలికల దినోత్సవ సభ లుఅంగన్వాడీ సూపర్వైజర్ జ్యోతిఅధ్యక్షతన శుక్రవారం జరిగాయి. ఈ సందర్బంగా ఎంఈవో జి. సుబ్బయ్య మాట్లాడుతూ… బాలికలు ఇతరుల మాయమాటలు నమ్మి మోసపోక ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుక రావాల న్నారు.అంగన్ వాడీ సూపర్ వైజర్ జ్యోతి మాట్లాడుతూ…. ప్రస్తుత సమాజంలోమగ, ఆడ తేడా లేదని ఇద్దరు సమానమేని తెలిపారు. ఆడపిల్లలను కన్నతల్లిదం డ్రులు ఎక్కువగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మంచిగా చదువుకొని ఉత్తములుగా రాణించాలన్నారు.వి.కె.ప్రభు త్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం శేషగిరి మాట్లాడుతూ….బాలికలు క్రమశిక్షణతో చదివి ఉన్నత చదువులు అభ్యశించి ఉన్నత పదవులు అధిష్టించి తమ కుటుంబా లకు మంచిఖ్యాతి తీసుక రావాలన్నారు. ఈ కార్యక్రమాల్లో కెజీబీవీ ప్రిన్సిపల్ జి.సుజిత, ఉపాధ్యాయులులక్ష్మి, కెజీబీవీ, హై స్కూల్ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *