సమీకృత రైతు సమాచార కేంద్రం ను ఉపయోగించుకోండి.

సమీకృత రైతు సమాచార కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. తురక పాలెం, దారం వారి పాలెం, మన్నేపల్లి రైతు భరోసా కేంద్రాల పరధిలో మంగళ వారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రబీ పంటలో సాగు చేసిన పంటలను ఈ – క్రాప్ నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని 14 అంకెల యూనిక్ నంబర్ వస్తుందని దాని ద్వారా వ్యవసాయ అనుబంధ శాఖల పథకాల అమలుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రధానంగా రైతుల సందేహాలను రైతు సాధికార సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 155251 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి పంటల తెగుళ్లు, పురుగుల నియంత్రణుకు నివారణ చర్యలకు తగిన సూచనలు తెలుసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో విఏఏ నాగమల్లేశ్వరి, బ్రహ్మయ్యలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *