ఎంపీ మాగుంట యోగక్షేమాలు తెలుసుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి అపోలో హాస్పిటల్ లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారన్న సమాచారంతో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గురువారం ఫోన్ కాల్ ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏంపీ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆరోగ్యంగా ఉండడంతో ఎంపీని ఫోన్ లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు మాట్లాడారు. ఐసియు నుండి రూముకు మార్చాక ఒకటి రెండు రోజుల్లో చెన్నై వచ్చి స్వయంగా కలుస్తామని తెలిపారు. ఆపరేషన్ అనంతరం తీసుకోవాల్సిన డైట్ గురించి మందుల గురించి ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ లక్ష్మి సంబంధిత డాక్టర్లతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ …ఎంపీ బైపాస్ ఆపరేషన్ విజయవంతమైందని అని ఆమె తెలిపారు. సర్జరీ విజయవంతం అవడం పట్ల ఆమె డాక్టర్లను అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *