ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం హెచ్ డీ ఎస్ సమావేశం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఎంపీపీ తాటికొండ మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందిస్తే సిబ్బందికి మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ కోవిద్ సమయంలో ఉత్తమ సేవలు అందించటంతో వైద్యశాలకు మంచి గుర్తింపు వచ్చిందని గుర్తు చేసారు. అదే గుర్తింపును మరింత కొనసాగించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, తహసీల్దార్ ఇస్మానియేల్ రాజు, ఎంపీడీఓ హనుమంతరావు, బికేవి పాలెం సర్పంచి వీ ఎస్ శ్రీకాంత్ రెడ్డి లు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. మొక్కలు నాటారు. వైద్యాధికారి మౌనిక, వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ఐఓ చంద్ర శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు


