ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ గౌడ జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని, అలాంటి నీరా కేఫ్ ను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా భేరత్తుగా తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక ఆర్థిక సహకార సంస్థ కు అప్పగించాలని గౌడ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. టూరిజం కార్పొరేషన్ తో నీరా కేఫ్ కు ఎలాంటి సంబంధం లేకుండా కల్లుగీత కార్పొరేషన్ కు శాశ్వతంగా అప్పగించేంతనరకు పోరాటం కొనసాగిస్తామని గౌడ సంఘాలు ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇచ్చాయి. నీరా కేఫ్ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 17వ తేదీన వేలాది మందితో మహాధర్నా కు గౌడ, కల్లుగీత సంఘాల సమన్వయ వేధిక పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ లో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ గౌడ సంఘాలు, గౌడ ప్రజాప్రతినిధులు, గౌడ ప్రముఖులు సమావేశమై సుధీర్ఘంగా చర్చించారు. మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి
మాజీ చైర్మన్ కె స్వామి గౌడ్, మాజీ మంత్రివర్యులు జి రాజేశం గౌడ్, తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్య గౌడ్, కొండూరి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, గౌడ సంఘాల నాయకులు పంజాల జైహింద్ గౌడ్, పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, డాక్టర్ బండి సాయన్న, అంబాల నారాయణ గౌడ్, వెంకట నర్సయ్య గౌడ్, సాయిలు గౌడ్, మోర్ల ఏడుకొండలు, చీకటి ప్రభాకర్ గౌ్డ్, బొనగాని యాదగిరి గౌడ్, పటేల్ వెంకటేశ్ గౌడ్, ఉడుతల బాలకృష్ణ గౌడ్, జక్కె వీరస్వామి గౌడ్, శ్రీకాంత్ గౌడ్, పంజాల శ్రవణ్ గౌడ్, మోతే చక్రవర్తి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
నీరా కేఫ్ గౌడుల ఆత్మగౌరవ ప్రతీక
– మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
నీరా కేఫ్ గౌడుల ఆత్మగౌరవ ప్రతీక అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని, కల్లుగీత కార్పొరేషన్ కు అప్పగిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హామీ మేరకు మహా ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని చెప్పారు. పూర్తి హక్కులతో కల్లుగీత కార్పొరేషన్ కు అప్పగించకపోతే యధావిధిగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా గౌడులు సంఘటితం కావాలి
* శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్
తమ హక్కుల సాధనకు రాజకీయాలకు అతీతంగా గౌడులు సంఘటితమై పోరాడాల్సిన శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు.
గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చేసిన తీర్మానాలు:
1. గత వారం రోజులుగా నీరా కేఫ్ రక్షణ కోసం ఆందోళన చేస్తున్న కారణంగా ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అందుకే మహా ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది.
2. ప్రభుత్వం నీరా కేఫ్ ను భేషరతుగా కల్లు గీత కార్పొరేషన్ కు అప్పగించాలి.
3. ప్రభుత్వం ఇచ్చిన అన్ని వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి.
4. రాష్ట్రంలో ఒక ” తెలంగాణ గౌడ మహాసభ “ను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించడం జరిగింది.
5. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రకటిస్తాం అని నిర్ణయించడం జరిగింది

