తాళ్లూరు పోలీస్ స్టేషన్ కు తూర్పుగంగవరం కు చెందిన గూడా వెంకటరెడ్డి, సుబ్బమ్మ చారిటబుల్ ట్రస్ ఆద్వర్యంలో గూడా కుటుంబీకులు కంప్యూటర్ ను పోలీస్టేషన్లో సీఐ రామారావుకు గురువారం అందజేశా రు. పోలీస్ స్టేషన్లో కంప్యూటర్ లేక సిబ్బంది ఇబ్బంది పడుతుండటంతో గూడా కుటుంబీకులు ముందుకు వచ్చి తమ వంతుగా వితరణ అందజేశారు. పోలీస్ స్టేషన్ కు కంప్యూటర్ ను బహుకరించటం పట్ల సీఐ రామారావు గూడా కుటుంబీకులను అభినందించారు. ఈకార్యక్రమంలో స్థానికఎస్సై ఎస్. మల్లిఖార్జునరావు, గూడా ప్రసాద్ రెడ్డి, గూడా శ్రీధర్ రెడ్డి గూడారాజశేఖర్ రెడ్డి, గూడా సాయి ఫణీంద్రరెడ్డి, గూడా చిన్న బ్రహ్మారెడ్డి, గూడా గోపాల్ రెడ్డి,వెంకట సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
