కోనేరు అభివృద్ధికి చర్యలు చేపడతాం – డ్వామాపీడీ జోసెఫ్

పవిత్రపుణ్యక్షేత్రమైన గుంటిగంగ సన్నిధిలో పాడుబడ్డ కోనేరు అభివృద్ధికి చర్యలు చేపట్టి కోనేరు పూర్వవైభవం తీసుక వస్తామని జిల్లా డ్వామాపీడీ జోసెఫ్ తెలిపారు.తాళ్లూరు మండలంలో గుంటిగంగ సన్నిధిలో నిరుపయోగంగా వున్న కోనేరును ఆయనగురువారం పరిశీలించారు. కోనేరు ఎంతో ప్రాముఖ్యత చెందినదని, గతంలో కోనేరు సంవత్సరంపాటు నిత్యం ప్రవహిస్తూ వుండేదని, కొండపై పుట్టిన జల కోనేరులోకి వచ్చి స్వచ్చతగా మహనందీ కోనేరును తలపిస్తూ వుం డేదని గుంటి గంగమ్మ ఆలయకమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం పీడీ దృష్టికి తీసుక వచ్చారు. గత కొంతకాలంగా కోనేరు పూడిపోయి నీరు కిందికి వెళ్లక నిల్వ వుంటూ పాచిపట్టి పోయాయని తెలిపారు. ఉపాధి పథకం ద్వారా నిధులు సమకూర్చి కోనేరు, ప్రక్కనున్న పెద్దకుంట పూడిక తీతపనులు చేయించి కోనేరుకు పూర్వవై భవంతీసుక రావాలని తెలిపారు. కోనేరు పూడిక తీతపనులను అంచనాలు తయారు చేసి పంపాలని ఉపాధి సిబ్బందిని పీడీ ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట ఏపీడీ లతితకుమారి, ఈసీ గురుబాబు, టీఏ కోటేశ్వరరావు, ఎఫ్ఎ చాట్ల డానీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన డ్వామా పీడీ…

పవిత్రపుణ్యక్షేత్రమైన గంగమ్మను డ్వామా పీడీ జోసెఫ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయకమిటీ అధ్యక్షులు గురుబ్రహ్మాం పీడీని శాలువాతో సత్కరిం చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *