మానవతావాది, ప్రపంచ మేధావి డా. బి. ఆర్ అంబేడ్కర్ స్పూర్తి తో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి

మానవతావాది, ప్రపంచ మేధావి డా. బి. ఆర్ అంబేడ్కర్ స్పూర్తి తో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఒంగోలు ప్రకాశం భవనం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా. బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు, ఎస్.ఎన్ పాడు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, బిఎన్ విజయ కుమార్, ఒంగోలు నగర పాలక సంస్థ చైర్ పర్సన్ గంగాడ సుజాత లతో కలసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…. మానవతావాది ప్రపంచ మేధావి డా. బి. ఆర్ అంబేడ్కర్ గారి విగ్రహాన్ని కలెక్టరేట్ లో ఆవిష్కరించడం ఎంతో సంతోషదాయకమన్నారు. సొంతంగా, స్వచ్చంగా నిబద్దతతో మహనీయులు డా. బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత సంఘం జిల్లా కమిటీ ఏర్పాటుచేయడం అభినందనీయం అని, వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి తెలిపారు. రాజ్యాంగం ప్రకారం మన హక్కులకు స్పూర్తి కలిగించేలా కలెక్టరేట్ లో డా. బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. ఈ రోజు ఎన్నో అవకాశాలు ఆ మహనీయుడి వలన కలిగినప్పటికినీ, వారు ఆశించిన స్థాయిలో మనం ముందుకు పోలేకపోయామన్నారు. ఏ సదుపాయాలు లేని రోజుల్లో వారు విదేశీ విద్యను అభ్యసించి విదేశాల్లో మన్ననలు పొందడం వారి యొక్క బహుముఖ ప్రతిభకు నిదర్శనం అని మంత్రి అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరికం లేని సమాజానికి కృషి చేస్తున్నారన్నారు. డా బి ఆర్ అంబేద్కర్ స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పధకాల ఫలాలు ప్రతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాలలో, గురుకుల పాటశాలల్లో డా. బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటుచేయడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుండి వారి జీవిత చరిత్ర విద్యార్దులకు తెలిసేలా పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నేడు రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలలో, గురుకుల పాటశాలల్లో సంస్కరణలతో పాటు వసతులకు పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి సంక్షేమ హాస్టల్ విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందేలా సన్న బియాన్ని సరఫరా చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఎస్.సి., ఎస్.టి అట్రాసిటి కేసుల బాధితులకు దీర్ఘకాలికంగా పెండింగ్ లో వున్నటు వంటి నిధులను 40 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందిని, ఇంకా 20 కోట్ల రూపాయలు బకాయలు ఉన్నాయని, మే నాటికి పూర్తిగా నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు.
ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ… ఒంగోలు కలెక్టరేట్ లో మహనీయులు డా. బి. ఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాల సంతోషం, విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘాలకు అభినందనీయమన్నారు. ఈ రోజు రాజ్యాంగం అమలు జరుగుచున్నదంటే ఆ రోజు డా. బి. ఆర్ అంబేడ్కర్ ముందు చూపుతో వ్రాసిన రాజ్యాంగం వల్లనే అని అన్నారు. అలాంటి పెద్దల ఆశయాలను మనమంతా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు రావాలన్న ఉద్దేశ్యం, లక్ష్యంతో డా. బి. ఆర్ అంబేడ్కర్ ఎంతో కృషి చేసారని, వారి స్పూర్తితో నేడు రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు.
లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్య రావు, మాట్లాడుతూ….. డా. బి. ఆర్ అంబేద్కర్ గారి స్పూర్తితో ఉద్యోగులు, సంఘాలు ముందుకు వెళ్లాలన్నారు.
కార్యక్రమంలో జరుగుమల్లి మండల ఎం. ఈ. ఓ బత్తుల నాగేంద్రవదన్, పల్నాడు జిల్లా డిఆర్ఓ మురళి, డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మా నాయక్, ఎస్.సి కార్పోరేషన్ ఈ డి అర్జున్ నాయక్, ఆర్ఐఓ ఏ.సైమన్ విక్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, ఏ.పి అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కూచిపూడి శరత్ బాబు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యకులు, ఈదర విజయ భాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి. సునీల్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు జూపల్లి రాజు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు, వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు  పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *