శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవస్థానం, మరియు గోశాల ఆధ్వర్యములో చలివేంద్రం ప్రారంభం

శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవస్థానం, మరియు గోశాల ఆధ్వర్యములో మండు వేసవిలో పాదచారులకు దాహార్తితీర్చుటకు చలివేంద్రమును తిరుమలశెట్టి అంజిబాబు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విశ్వమాత సొషల్ సర్వీస్ సొసైటి నిర్వాహకురాలు కమ్మిశెట్టి లక్ష్మి చలివేంద్రమును ప్రారంభించారు. ముందుగా ఒంగోలు గాంధీరోడ్డులోని పెండ్యాల ఆర్యవైశ్య సత్రం నిర్వాహకురాలు అయినాల శుభాదేవి బృందం గోపూజ నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా కమ్మిశెట్టి లక్ష్మీ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల పైగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పాదచారుల దాహార్తి తీర్చడానికి అంజిబాబు కృషి చేయడం అభినందనీయమని వేసవిలో ఈ చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని ఎండ వేడి నుండి ఉపశాంతి పొందాలని అన్నారు.

కార్యక్రమంలో యోగ ట్రైనర్ చుండూరు శ్రీనివాసరావు, ధనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *