సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణతో పాటు ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాలి ఎమ్మెల్యే తలసాని…………….

బేగంపేట మార్చి 16 (జే ఎస్ డి ఎం న్యూస్)
సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణతో పాటు తమ ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్స్ ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఆదివారం సనత్ నగర్ లోని బి కే గూడ లో శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ కు వైద్య పరీక్షల పరికరాలు, ట్యాబ్ లెట్స్ లతో కూడిన కిట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తమ వయసును సైతం లెక్క చేయకుండా అనేక సేవా కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వేలాదిమంది ఆకలి తీరుస్తున్నారని, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ యాజమాన్యం శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ కు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా సి ఎస్ ఆర్ ఫండ్ క్రింద 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. సీనియర్ సిటిజన్స్ ఆరోగ్య పరిరక్షణ కోసం ఆర్ధిక సహాయం అందించడం పట్ల హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ పార్థసారధి, మాణిక్ రావ్ పాటిల్, ప్రైమ్ హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ లు సుష్మ, రవి శంకర్, అనంత రెడ్డి, కృష్ణారెడ్డి, అమీర్ పేట డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, కూతురు నర్సింహ, గోపిలాల్ చౌహాన్, బలరాం, వనం శ్రీనివాస్, హరి, మధు తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *