సాహిత్య శిఖరం ‘పెనుగొండ ‘అరసం ఆధ్వర్యంలో పెనుగొండ లక్ష్మీ నారాయణకు ఘన సన్మానం

జె. ఎస్ . డి. ఎం. ప్రతినిధి : (హైదరాబాద్) : అభ్యుదయ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ ఓ సాహిత్య శిఖరమని పలువురు కవులు, రచయితలు కొనియాడారు. ఆయన అరసం జెండా అని ప్రశంసించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత, కేంద్ర సా హిత్య అకాడమీ అవార్డు గ్రహిత, పెనుగొండ లక్ష్మీనారాయణను అత్మీయ సన్మాన సభను నిర్వహించారు. ప్రముఖ అభ్యుదయ రచయిత, తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఎస్ .వి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన సభకు సిపిఐ జాతీయ కార్య వర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దా ల అశోక్ తేజ, నవచేతన పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు, ప్రముఖ రచయిత డా. ఏటుకూరి ప్రసాద్, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ జూల్లూరి గౌరిశంకర్, అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ, విశా లాంధ్ర ఎడిటర్ ఆర్ వి రామారావు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి బాలాచారి, అరసం అధ్యక్షులు పల్లేరు వీరస్వామి, కోయి కోటేశ్వర రావు, అరసం కార్యనిర్వహక కార్యదర్శి కెవిఎల్, ప్రజానా ట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహా, అరసం నగర్ కార్యదర్శి చంద్రమోహన్ గౌడ్, తిరుపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అరసం నేతలు పెనుగొండ లక్ష్మీ నారాయణను శాలువా, మెమెంటో, గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్వి సత్యనారా యణ మాట్లాడుతూ…. పెనుగొండ లక్ష్మీనారాయణ అనేక దశాబ్దాలుగా అభ్యదయ సాహిత్యోద్యమ విస్తృతికి ఇతోధిక కృషి చేస్తున్నరన్నారు. అరసం జాతీయ అధ్యక్షుడుగా పనిచేస్తూనే అనేక విమర్శ గ్రంథాలు రాశారని, ఆయన రాసిన దీపిక విమర్శ గ్రంథానికి అవార్డు రావడం అభినందనీయమని తెలిపారు. నవచేతన పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు, ప్రముఖ రచయిత డా. ఏటుకూరి ప్రసాద్ మాట్లాడుతూ ….సుదీర్ఘ కాలం అరసం జెండాను భుజాన వేసుకొని అభ్యుదయ సాహిత్యేద్య మంలో కొనసాగడం చిన్నవిషయం కాదని, ఆయన సాహిత్యం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ …….భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)తో ఎంతో విడదీయ రాని అనుబంధం పెనుగొండది అని అన్నారు. ఈ సందర్భంగా పల్లేరు వీరస్వామి రాసిన వీక్షణం పుస్తకం ఆవిష్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *