పార్కులో లక్ష విలువైన సిమెంట్ పనులు చేయించిన గాంధీపార్క్ పతంజలి పవర్ యోగా సభ్యులు.

గత పదిహేను సంవత్సరాలుగా గాంధీపార్క్ లో యోగాగురు గోపాల్ రెడ్డి నేతృత్వములో యోగా నేర్చుకొంటూ ఎందరో తమ ఆరోగ్యమును సవరించుకొంటూ ఉన్నారు. దాదాపుగా 15 సం.క్రితం అప్పటి పార్లమెంట్ సభ్యులు యంపి నిధులతో పార్క్ అభివృద్ధి చేసిన తరువాత నగర ప్రజలు సాయంత్రం వేళలలో నడక, పిల్లలతో షికారుకు, శ్రమనుండి స్వాంతనకు గాంధీ పార్క్ కు వచ్చేవారు. ఉదయం యోగా గురు నేతృత్వంలో యోగా ప్రాక్టీస్ చేసేవారు. కాలక్రమేణా యోగా చేయు ప్రదేశం చిన్నచిన్న గుంటలు పడి యోగాకి అనుకూలంగా లేకపోయేసరికి మున్సిపల్ కమీషనర్ కోడూరి వేంకటేశ్వర్లు గారి అనుమతితో యోగా సభ్యుల సహకారంతో దాదాపుగా లక్ష విలువైన సిమెంట్ పనులను పూర్తి చేసుకొని ఎంతో ఉత్సాహంగా యోగా తరగతులు నిర్వహించుకొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆదివారం, ఉదయం పునః యోగా తరగతుల ప్రారంభంతో గాంధీపార్క్ యోగా శిష్యబృదంతో నిండిపోయింది.

ఈ సందర్భముగా యోగాగురు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా యోగా తరగతులు నిర్వహించుకుంటూ యోగ ప్రాక్టీస్ చేస్తున్నామని ఈ ప్రదేశం అంతా యోగ ప్రాక్టీస్కు ప్రతికూలంగా మారడంతో
కమిషనర్ గారి అనుమతితో పతంజలి పవర్ యోగ సభ్యులు శిష్యుల సహకారంతో లక్ష రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. నిత్యం యోగా చేసేవారు ఎంతో ఆరోగ్యంతో తాము చేసే రోజువారి పనుల్లో ఎంతో ఉత్సాహంతో దృఢ సంకల్పంతో ఉంటారు కావున ప్రతి ఒక్కరు యోగాని నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మురళి, రావూరి వెంకటేశ్వరరావు, జిటి నాయుడు, తాత ప్రసాద్, యోగ మిత్రబృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *