పదవ తరగతి మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయబోతున్నట్లు చెప్పారు. వీరిలో బాలురు 14,994 మంది, బాలికలు 14,608 మంది ఉన్నట్లు వివరించారు. విద్యార్థులలో 28176 మంది ఇంగ్లీష్ మీడియం, 1423 మంది తెలుగు మీడియం, మరో ముగ్గురు ఉర్దూ మీడియం వారు ఉన్నట్లు డీ.ఈ.వో. తెలిపారు. గత ఏడాది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని వందమంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరు అవుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గం. నుంచి మధ్యాహ్నం 12.45గం. వరకు జరుగుతాయని అన్నారు. పరీక్ష కేంద్రంలోకి అనుమతించటానికి 30 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందన్నారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షిoచేoదుకు 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను , పరీక్షల సామగ్రిని సరఫరా చేయడానికి 12 మంది రూట్ ఆఫీసర్లను నియమించినట్లు వివరించారు.
అదేవిధంగా ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలోనూ మార్చి 17 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు 1,564 మంది హాజరవుతారని, వీరి కోసం 23 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి అన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం కూడా రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాసే కేంద్రంలోనే కొన్ని గదులను కేటాయించినట్లు తెలిపారు.
పరీక్షలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి పుకార్లను వ్యాప్తి చేసినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీ.ఈ.వో. హెచ్చరించారు.
