చెత్తసంపద తయారీ కేంద్రాలు వినియోగంలోకి వస్తే పంచాయతీలకు ఆదాయం-డిఎల్. పి. ఓపద్మ

గ్రామాల్లో చెత్తసంపద తయారీ కేంద్రా
లకు మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తీసుక వస్తున్నామని, పంచాయతీ లకు ఆదాయ వనరుగా వుంటుందని ఒంగోలు డిఎల్.పి.ఓ
పద్మ తెలిపారు. తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని చెత్తసంపద తయారీ కేంద్రంలో తయారు చేస్తున్న వర్మి కంపోస్టు ను ఆమె ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమెమాట్లాడుతూ చెత్తసంపద తయారీ కేంద్రాలు వాడుకలో లేనందున పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. నిధులు స మకూర్చి చెత్త సంపద కేంద్రాలకు మరమ్మత్తులు పూర్తి చేయటం జరిగిందన్నారు. గ్రామాల్లోని చెత్తనుఆకేంద్రాలకు తరలించివర్మి కంపోస్టుఎరువును తయారు చేస్తు న్నట్లు తెలిపారు.ఆ వర్మికంపోస్టును విక్రయిస్తే పంచాయతీకి ఆదాయవనరుగా వుంటుందని, గ్రామపంచాయతీల అభివృద్ధికి నిధులు ఉపయోగ పడతాయన్నారు.
గ్రామాల్లో ఇంటిపన్నులను వేగవంతంగా వసూళ్లు చేయాలని, పారిశుద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. గ్రామంలోని సచివాలయంను సందర్శించారు. ఇంటిపన్నులు చెల్లించిన గృహయజమానులకు రసీదులు అందజేశారు. ఈకార్యక్ర
మంలోగ్రామపంచాయతీ కార్యదర్శి టి. అజయ్ కీర్తి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list
Next పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ -పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన జిల్లా ఎస్పీ -పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు… జిరాక్స్‌ సెంటర్లు మూసివేత -పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు మరియు పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర వ్యక్తులు గానీ ఉండరాదు -పరీక్షా కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు -మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే విద్య నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *