నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తో పాటు Crew-9 మిషన్ సభ్యులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి తెల్లవారుజాము 3-27 నిమిషాలకు ఫ్లోరిడా దగ్గర సముద్ర జలాలలో విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చారు. గత 9 నెలల క్రితం వెళ్లి అక్కడ ఇరుక్కుపోయిన విషయం విదితమే. అయితే ఇప్పుడు సునీతాతో పాటు ఇతర వ్యోమగాములు భూమి వాతావరణానికి అలవాటు పడే ప్రక్రియను ప్రారంభిస్తారు. భూమి గురుత్వాకర్షణ శక్తికి వాళ్ల శరీరాన్ని పూర్తిగా అలవాటు చేయడానికి టైమ్ పడుతుంది. దీనికోసం వాళ్లు ట్రైనింగ్ తీసుకోవాలి. 9 నెలల పాటు మైక్రోగ్రావిటీలో ఉన్నాక శరీరాన్ని మళ్లీ భూమి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు చేయడం ఈజీ కాదు. అందుకే నాసా వాళ్ల కోసం ఒక స్పెషల్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ రెడీ చేసింది.
