తాళ్లూరు మండలంలో రమణీయం రాముల వారి కళ్యాణం

శ్రీరామ నవమి వేడుకలు మండలంలో ఆదివారం పలు గ్రామాలలో వాడ వాడలా నిర్వహించారు. చలువ పందిళ్ల వేసారు. పానకం, వడపప్పులు పంచిపెట్టారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.తెలుగువారికి ఆదర్శదేవుడు అయిన రాముని కళ్యాణంను తూర్పుగంగవరం కొదండరామరామస్వామి దేవాలయం, తాళ్లూరు, సుంకిరెడ్డి పాలెం, బొద్దికూరపాడు, విఠలాపురం, కొత్తపాలెం, నాగంబొట్లపాలెం, లక్కవరం, బొద్దికూరపాడు, దారంవారిపాలెం, తురకపాలెం, శివరామపురం, రజానగరం, కొర్రపాటివారిపాలెం, రమణాలవారిపాలెం, మన్నేపల్లి, దోసకాయలపాడు, తోటవెంగన్నపాలెం, వెలుగువారిపాలెం తదతర గ్రామాలలో దేవాలయాల వద్ద ఉభయ దాతలు ప్రత్యేకపూజలు చేసి పానకం, వడపప్పు ప్రసాదాలను భక్తులకు పంచి పెట్టారు. భక్తులు ప్రత్యేక పూజాకార్యక్రమాలలో పాల్గోన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సుంకిరెడ్డి పాలెం లో ఇడకమంటి ఉపేంద్ర రెడ్డి రాముల వారి ఉత్సవ విగ్రహాలను బహుకరించారు. ఉభయ దాతలు ఇడమకంటి పెద్ది రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నుసుం నాగి రెడ్డి దంపతులు అన్నదానం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *