బేగంపేట ఏప్రిల్ 6 (జె ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట డివిజన్ అల్లం తోటబాయి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. నూతన ఫౌండర్ అధ్యక్షుడిగా గౌరపల్లి లక్ష్మణ్ ఉపాధ్యక్షులుగా భట్టి శివకుమార్, ఎం శ్రీరామ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా జక్కుల కృష్ణ, జనరల్ సెక్రెటరీగా కుమ్మిడి పద్మారెడ్డి కోశాధికారిగా బూరుగు నర్సింగరావు జాయింట్ ట్రెజరర్ గా గౌరపల్లి శరత్చంద్ర లీగల్ అడ్వైజర్ గా జయ బాబురావు జాయింట్ సెక్రటరీగా డేవిడ్ రాజు, మురళీకృష్ణ ,సమీవుద్దీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎం శాంతి కుమార్, ఏ రవీందర్, బి.సత్యనారాయణ, ఎండి ఉస్మాన్, నాగేష్, కె .మల్లేష్, బాల, ఎం .శ్రీనాథ్, జి ఎన్ శ్రీకాంత్ ,పి .సంతోష్, అసద్ హుస్సేన్, జి .రఘురాం లు ఎన్నికయ్యారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లుగా జి .దీప్ కుమార్, వై .అభిమన్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన ఫౌండర్ అధ్యక్షుడు గౌరపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ నూతన కార్యవర్గ సహాయ సహకారాలతో అల్లం తోట బాయి నీ అభివృద్ధి లో ముందుంచుతాను అన్నారు.కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారం తో అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుందని గౌరపల్లి లక్ష్మణ్ తెలియజేశారు.
అల్లం తోట బాయి వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అధ్యక్షుడిగా గౌరవపల్లి లక్ష్మణ్…………….
07
Apr