సనత్‌నగర్, ఏప్రిల్ 6 (జె ఎస్ డి ఎం న్యూస్) :
శ్రీరామనవమి సందర్భంగా సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యురాలు మరియు సనత్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా. కోట నీలిమ పాల్గొన్నారు. భక్తులతో కలిసి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీరామనవమి పర్వదినం ప్రజలందరికీ శాంతి, ఐక్యత, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు డా. నీలిమ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నీలిమా తో పాటు సనత్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

