బేగంపేట ఏప్రిల్ 8(జే ఎస్ డి ఎం న్యూస్):
హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువతిని హైడ్రా డి ఆర్ ఎఫ్ బృందం మంగళవారం కాపాడింది. రాజీవ్ గాంధీ కాలనీ బాలానగర్‌లో నివసిస్తున్న 36 ఏళ్ల మహిళ కుటుంబ కలహాల కారణంగా హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు ఈ సమాచారాన్ని హైడ్రాకు ఫోన్ చేసి చెప్పగా వెంటనే డి ఆర్ ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. తాళ్ళ సాయంతో సిబ్బంది ఆమెను సురక్షితంగా కాపాడారు. తర్వాత మహిళను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.
