కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ – మెడ్ట్రానిక్ సంస్థ ఆధ్వర్యంలో రీనల్ డెనర్వేషన్ థెరపీ సెంటర్ ఏర్పాటు.

బేగంపేట ఏప్రిల్ 9(జే ఎస్ డి ఎం న్యూస్) :
దేశంలోనేమొట్టమొదటిసారిగా బేగంపేట కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో మెడ్రానిక్ సంస్థతో కలిసి రీనల్ డెనర్వేషన్ థెరపీ క్లినిక్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ హెడ్ ఆఫ్ కార్డియాలజీ & కార్డియోథోరాసిక్ సర్జన్ డా. శ్రీధర్ కస్తూరి తెలిపారు. బుధవారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో ప్రపంచస్థాయి వైద్య సాంకేతికత రంగంలోని ఒకటైన మెడ్ట్రానిక్ సంస్థతో కలసి రీనల్ డెనర్వేషన్ థెరపీ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ భాగస్వామ్యం మేమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఎం ఓ యు ద్వారా అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. బి. భాస్కర్ రావు మాట్లాడుతూ “సాంప్రదాయ చికిత్సలతోనూ నియంత్రణలోకి రాని హైపర్‌టెన్షన్ నేడు అత్యంత తీవ్ర ఆరోగ్య సమస్యగా మారిందని, మెడ్ట్రానిక్‌తో మేము చేస్తున్న ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఆధునిక, ఆధారిత చికిత్సలను అందించడంలో విప్లవాత్మక ముందడుగుగా పిలుస్తుందన్నారు. ఇది కేవలం సాంకేతికత విషయమే కాదు, ఇది మా వైద్యులకీ, రోగులకీ సమగ్ర శిక్షణ, జ్ఞానం మరియు అనుభవాలను కలిసివచ్చే హోలిస్టిక్ కేర్ వ్యవస్థను నిర్మించాలనే దిశగా ముందుకు తీసుకెళ్తోందదని మేము హైపర్‌టెన్షన్ నిర్వహణకు కొత్త ప్రమాణాలను స్థాపించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవి గురవారెడ్డి మాట్లాడుతూ “ఈ భాగస్వామ్యం తో నియంత్రించలేని రక్తపోటుతో బాధపడే రోగులకు ఆధునిక చికిత్సను అందించాలనే ప్రయత్నంలో ఒక గొప్ప ముందడుగు అన్నారు. మెడ్ట్రానిక్ సంస్థ అందించే టెక్నాలజీని మా నిపుణత్వంతో కలిపి, హైపర్‌టెన్షన్ నిర్వహణలో కొత్త యుగానికి దారితీస్తున్నాము. మా లక్ష్యం కేవలం వైద్య ఫలితాలను మెరుగుపరచటం మాత్రమే కాదు, ఔషధ చికిత్సలకు మించి శాశ్వతమైన పరిష్కారాలను అందించడం ద్వారా రోగులను శక్తివంతులుగా చేయడమే అన్నారు.మెడ్ట్రానిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ ప్రెసిడెంట్ మందీప్ సింగ్ కుమార్ మాట్లాడుతూ
“మెడ్ట్రానిక్‌లో, మేము స్థిరమైన ఆవిష్కరణలు మరియు సమర్థవంతమైన భాగస్వామ్యాల ద్వారా ఆరోగ్య సంరక్షణను రూపాంతరం చేయాలనే నిబద్ధత కలిగి ఉన్నామని తెలిపారు. కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్‌తో భాగస్వామ్యం ద్వారా, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు అభివృద్ధి చెందిన శిక్షణను అందించడమే కాకుండా, రీనల్ డెనర్వేషన్ థెరపీపై అవగాహన పెంచడానికీ ఇది దోహదపడుతుంది. నియంత్రించలేని హైపర్‌టెన్షన్‌ను ఎదుర్కొనడంలో, ఈ భాగస్వామ్యంతో మేము రోగుల సంరక్షణను మెరుగుపరచే దిశగా దూసుకుపోతున్నాము. సాంకేతికతను ఉపయోగించి, భాగస్వామ్యాన్ని పెంపొందించి, మేము బాధను తగ్గించటం, ఆరోగ్యాన్ని పునరుద్ధరించటం మరియు జీవితాన్ని పొడిగించటం అనే మా లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాము.
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ హెడ్ ఆఫ్ కార్డియాలజీ & కార్డియోథోరాసిక్ సర్జరీ డా. శ్రీధర్ కాస్తూరి మాట్లాడుతూ హై బీపీ ( అధిక రక్తపోటు) కారణంగా హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, పక్షవాతం, మెదడులో రక్తస్రావం సంభవిస్తున్న 100 మరణాల్లో 10 మరణాలు ఉంటున్నాయని తెలిపారు. అడల్ట్స్ లో ప్రతి ముగ్గురిలో ఒకరికి హైబీపీతో బాధపడుతున్నారని ఐ సి ఎం ఆర్ గైడ్లైన్స్ ప్రకారం తెలుస్తుందన్నారు. రెగ్యులర్గా మందులు వాడుతున్న, రక్తపోటు కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ మందులు వాడుతున్న వారికి రీనల్ డెనర్వేషన్ థెరపీ ప్రొసీజర్ ద్వారా చికిత్స అందించడం ద్వారా రక్తపోటు కంట్రోల్లోకి రావడంతో పాటు వారు రోజు వారుగా వాడే మందులను కూడా తగ్గించుకోవచ్చు అని తెలిపారు. ఈ క్లినిక్ ను బేగంపేట లోని కిమ్స్ సన్ షైన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ తెరపి వల్ల ఎంతోమందికి మెరుగైన వైద్య సేవలుఅందించడంతోపాటు ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్ సి ఓ ఓ సుధాకర్ జాదవ్ తో పాటు కార్డియాలజిస్టులు డాక్టర్ శైలేందర్ సింగ్, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ కావ్యతో పాటు డిపార్ట్మెంట్ వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *