విఠలాపురం గ్రామంలో నూతనంగా ప్రతి ష్టంచనున్న శ్రీసీతా,లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టా నాభిశిలా ప్రతిష్టామహోత్సవం సందర్భముగా బుధవారం రుత్వికులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన రుత్వికులు సౌమిత్రి వేణుగోపాలాచార్యులు నేతృత్వంలోని పండితులు ఉదయం నుండి గురుప్రార్ధన. అనుష్టానపారాయణ,హోమపూజలు, అధివాసాహోమాలు నిర్వహించారు. 10.30గంటలకు పంచామృతవాసం, జలాదివాసం, తదితర పూజాకార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం గ్రామ బలిహరణ, యాగశాల బలిహరణ, మహామంగళహరతి వంటి కార్యక్రమాలు చేపట్టారు. సీతా, రామ, లక్ష్మణ, హనుమత్ విగ్రహాలను ప్రత్యేకంగా అలకరించిన వాహనంలో గ్రామోత్సం నిర్వహించారు. హోమ పూజల్లోమారంఅంజిరెడ్డి దంపతులు, పలువురు ఉభయ దాతలు దంపతులు పాల్గొని పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి, కె. లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
