జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుంటిగంగ అమ్మవారిని భక్తులు సహుద్భావవావాతావరణంలో తిలకించేలా ప్రజలుసహకరించాలని దర్శిడిఎస్పీ బి.లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటిగంగ సన్నిధి లో ఈ నెల 14వతేదీ జరుగ నున్న గుంటితిరునాళ్ల సందర్భంగా దేవదాయ శాఖ, గ్రామ పంచాయితీ అధికారు లు చేస్తున్న ఏర్పాట్లను బుధవారం రాత్రి పరిశీలించారు. డిఎస్పీ మాట్లాడుతూ… సుదూర ప్రాంతాలనుండి వచ్చేభక్తులకుఎలాంటి అసౌకర్యం కలుగకుండా ,ఆలయక మిటీసభ్యులు గ్రామపంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తిరునాళ్లలో, ట్రాఫిక్ కు అవరోధం కాకుండా వుండేందుకు పోలీస్ శాఖ విధించిన నిబంధనలు పాటించాలని తెలిపారు. తిరునాళ్లలో భక్తులు రద్దీఅధికంగా వుండే వీలున్నందున ట్రాఫిక్ కు అంతరాయం జరుగకుండా పోలీస్ శాఖ ఆద్వర్యంలో ట్రాఫిక్ పై ప్రత్యేక శ్రద్ద చూపినునట్లు తెలిపారు. తిరునాళ్ల ప్రాంగణంలో భక్తులకు ప్రజలు మంచి నీటి కోసం తల్లడల్లకుండా వుండెం దుకు పంచాయితీ , ఎండోమెంట్ శాఖవారు మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైఎస్. మల్లిఖార్జునరావు, ఆ
లయకమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (చందన) సానె సురేష్, ఎం.ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.


