జిల్లాలో బాండెడ్ లేబర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్ములించేలా అన్నీ శాఖల అధికారులు దృష్టి సారించడంతో పాటు బాండెడ్ లేబర్ వ్యవస్థ నుండి విముక్తి కాబడిన వారికి పునరావాసం కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషిచేయాల్సిన భాద్యత అందరిపై వుందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
గురువారం ఉదయం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో బాండెడ్ లేబర్ సిస్టం రద్దు యాక్ట్ 1976 పై అవగాహన కల్పించేందుకు అన్నీ శాఖల జిల్లా అధికారులకు, తహసిల్దార్లకు జిల్లా స్థాయి వర్క్ షాప్ ఏర్పాటుచేయడం జరిగింది. ఈ వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పాల్గొని మాట్లాడుతూ… జిల్లాలో బాండెడ్ లేబర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్ములించేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంతో పాటు బాండెడ్ లేబర్ వ్యవస్థ నుండి విముక్తి కాబడిన వారికి పునరావాసం కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషిచేయాల్సిన భాద్యత అందరిపై వుందన్నారు. ఇటీవల రెస్క్యూ చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బాండెడ్ లేబర్ వ్యవస్థలో పనిచేస్తున్న వారిని గుర్తించి ఆ వ్యవస్థ నుండి బయటకు తీసుకురావడం జరిగిందన్నారు. కొత్తపట్నం మండలంలోని అల్లూరు, ఈతముక్కల గ్రామాలకు చెందిన ఏడు కుటుంబాల వారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జామాయిల్ పనికి వెళ్ళగా, వారి అమాయకత్వాన్ని, అవసరాన్ని, పేదరికాన్ని అవకాశంగా చేసుకున్న యజమాని వారితో వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు, గర్భిణులు, బాలింతలచే బలవంతంగా పని చేయిసున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి వారిని వెట్టిచాకిరి వ్యవస్థ నుండి విడిపించడంతో పాటు వారికి రిలీప్ సర్టిఫికేట్స్ ఇవ్వడం, ప్రభుత్వం తరుపున నష్టపరిహరం ఇప్పించడం జరిగిందన్నారు. వీరిని వెట్టిచాకిరి నుండి విముక్తి చేయడంలో కృషి చేసిన ఒంగోలు ఆర్డిఓ లక్ష్మి ప్రసన్న ను, కొత్తపట్నం తహసిల్దార్ ను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఎవరైనా వెట్టిచాకిరి వ్యవస్థ నుండి విడిపించినప్పటికినీ, వారు మరలా ఆ వెట్టి చాకిరి వ్యవస్థలోకి నెట్టబడకుండా వారికి పునరావాసం కల్పించి వారు సమాజంలో గౌరవంగా జీవించేలా వారికి ఉపాధి, స్థిర నివాసం, వారి పిల్లల భవిష్యత్ కోసం అందరూ పనిచేయాల్సిన అవసరం వుందన్నారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని బాండెడ్ లేబర్ ను గుర్తించి విముక్తి కల్పించేలా పనిచేయాలని, అలాగే వెట్టి చాకిరి నుండి విముక్తి కాబడిన వారికి పునరావాసం కల్పించడంలో సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు.
తొలుత ఐజెఎం (International Justice Mission) ప్రతినిధి ప్రియాంక బాండెడ్ లేబర్ సిస్టం రద్దు యాక్ట్ 1976 పై సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని శాఖల అధికారులకు తెలియ చేసినారు.
ఈ సందర్భంగా ఈ – శ్రమ్ పోర్టల్ లో ప్లాట్ ఫాం కార్మికులను మరియు గిగ్ కార్మికుల్ని సమీకరణ మరియు పేర్లు నమోదు అవగాహన కొరకు కార్మిక శాఖ రూపొందించిన వాల్ స్టిక్కర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, అన్నీ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

