రైతులు పండించిన పంటలకు మద్దతుధర అందిస్తూ రైతులు దళారుల బారిన పడకుండా చేసేందుకే కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు వక్తలు అన్నారు.
మన్నేపల్లి, బొద్దికూర పాడు లలో ఆయా సొసైటీల ఆధ్వర్యంలో ఎపీ మార్క్ ఫెడ్ నాఫేడ్ లు కందుల కొనుగోల కేంద్రాలను ప్రారంభించారు. రైతులు తాము పండించిన కందులను నమోదు చేసుకుని మద్దతు ధరకు అమ్ముకోవాలని సకాలంలో వారి అకౌంట్స్కు నగదు జమ అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బి ఓబులు రెడ్డి, గొంది రమణా రెడ్డి (సమర), జిల్లా పార్లమెంటు కార్యదర్శి శాగం కొండా రెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, షేక్ పెద కాలేషా వలి (బడే) క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, పోలం రెడ్డి రమణా రెడ్డి, రాచకొండ వెంకట రావు, సొసైటీ సీఓలు అంజి రెడ్డి, శ్రీనివాస రెడ్డిలు పాల్గొన్నారు.

