కొర్రపాటి వారి పాలెంలో రాజుకున్న రాజకీయ రగడ – పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ – అధికార పార్టీకి కొమ్ముకాసారంటూ ఎస్సైపై ఆరోపణలు – కెవీ పాలెం కార్యకర్తకు గాయాలు- రిమ్స్ కితరలింపు- ఎస్పీని కలిసేందుకు సిద్ధమైన జిల్లా వైసిపి అధ్యక్షుడు

అభివృద్ధి పనులు అడ్డుకుంటూ అధికార ప్రతి పక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న నేపధ్యంలో పంచాయితీ పోలీస్ స్టేషన్ కి చేరింది. పోలీస్ స్టేషన్లో వైపీపీ కార్యకర్త విష్ణును ఎస్సె మల్లిఖార్జున రావు కొట్టటంతో వైసీపీ శ్రేణులు జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమైనారు. వివరాలలోనికి వెలితే…. కెవీ పాలెంలో గత ప్రభుత్వంలో జల జీవన్ మిషన్లో రూ.80 లక్షల నిధులతో ఓవర్ హెడ్ ట్యాంక్, పైపులు మంజూరు అయ్యాయి. దాదాపు రూ.40 లక్షల మేర పనులు పూర్తి అయ్యాయి. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఏ పంచాయితీ పనులు ఆ పంచాయితీలోని సర్పంచిలు చేసుకోవాలంటూ అధిష్టానం తీర్మాణం చేసారు. ఈ తరుణంలో వైసీపీ కార్యకర్త విష్ణు, శరత్ లుచేసిన పనులు నిలిచి పోయి, కొంత మేర బిల్లులు ఆగిపోయాయి. ఈ తరుణంలో నూతనంగా కెవి పాలెం నుండి వెల్లం పల్లి రోడ్ వరకు మైనర్ కాలువపై రూ. 15 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు అయ్యాయి. దీనిని టిడిపి నాయకులు గొల్లపూడి వేణుబాబు పూర్తి చేసారు. దీనిపై వైసీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదులు చేయటంతో రగడ మొదలైనది. ఇదే తరుణంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి పుట్టిన రోజు వేడుకలను, ఓ అభిమాని మొక్కబడి కార్యక్రమాలకు గ్రామానికి డాక్టర్ బూచేపల్లి రావటంతో ప్లేక్సీలు ఏర్పాటు చేసారు. అదే రోజు కొందరు ఆకతాయిలు ఆ గ్రామ సర్పంచి శ్రీదేవి, రామయ్య నివాసంపై ఖాళీ సీసాలు, గ్లాస్లు వేసారంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఫిర్యాదును విచారించే నిమిత్తం వైసీపీ కార్యకర్తలు విష్ణు, శరత్,టిడిపి నాయకులు వేణు, సర్పంచి రామయ్యలను పిలిపించి ఎస్సై మాట్లాడారు. ఎస్సై ముందే ఒకరి కొకరు రెట్టించుకోవటంతో ఎస్సై ఇరువురిని మందలించి బయటకు పంపించి వేసారు. ఈ తరుణంలో బయటే ఉన్న ఇరు పార్టీల కార్యకర్తలను చూసి అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు దూషణలను దిగటంతో క్రొపోద్రోకుడైన ఎస్సై స్టేషన్ వద్ద ఇటువంటి పనులు చేస్తారంటూ వైసీపీ నేతలకు కౌల్సిలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో విష్ణు దెబ్బలతో రిమ్స్ చికిత్స నిమిత్తం వారి బంధువులు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న వైసీసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి రిమ్స్ కి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకుని గురువారం తెల్లవారు జాము వరకు ఉండి వచ్చారు. వైసీపీ కార్యకర్తలకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ను కలిసి తెలపటానికి సిద్ధం అయ్యారు. ఈ ఘటనపై ఎస్సై మల్లిఖార్జున రావును వివరణ కోరగా సర్పంచి ఫిర్యాదు మేరకు వైసీపీ కార్యకర్త విష్ణు మరో నలుగురిపై కేసు నమోదు చేసామని, తాము కౌల్సిలింగ్ మాత్రమే ఇచ్చామని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *